Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో నిరసనలు, ధర్నాలు నిర్వహించే విషయంలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిరసనలకు అనుమతించిన ప్రదేశాల్లో ఒకటైన జంతర్ మంతర్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. ఇకపై అక్కడ నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను పోలీసులు సూచించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతోన్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్లను నిరసనలకు వేదికలుగా వినియోగించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పౌరులు తమ నిరసన తెలిపే హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా జంతర్ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి తొలగించినట్లు ఢిల్లీ పోలీసుల నోటీసుల్లో పేర్కొన్నారు. కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా డీనోటిఫై చేస్తున్నాం అని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ వెల్లడించారు. నిరసనలు, ఆందోళనల నిర్వహణకు సంబంధించి ఈ మూడు ప్రాంతాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రత్యేకంగా సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన పాత ఆదేశాల్లో పాక్షిక మార్పులు చేస్తూ తాజా నోటీసు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు, ఎంపీలు ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ఆందోళనలు ఉన్నాయని పేర్కొంటూ వారు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను పెద్ద ఉద్యమంగా అభివర్ణించారు. రాజకీయంగా పోరాటం కొనసాగించడంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఎన్నికల వ్యవస్థను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..