Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekar Case: సుకేష్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం ప్రశ్నించింది. నోరా ఫతేహిని 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎలాంటి బహుమతులు వచ్చాయి, ఎవరితో మాట్లాడింది, వారిని ఎక్కడ కలిశారని పోలీసులు అడిగినట్లు తెలిసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను సుకేష్‌తో విడిగానే మాట్లాడినట్లు వెల్లడించింది. నెయిల్ ఆర్ట్ ఫంక్షన్ కోసం అతని భార్య తనతో మాట్లాడిందని, ఆపై తరచూ తనకు ఫోన్ చేసేదని ఆమె చెప్పారు. వారు ఆమెకు బీఎండబ్ల్యూ, ఇతర కార్లను బహుమతిగా ఇచ్చారని వెల్లడించింది. అయితే అతని నేరనేపథ్యం తనకు తెలియదని నోరా ఫతేహి పోలీసులకు తెలిపింది. సుకేష్ తన మేనేజర్, కజిన్‌తో ఎక్కువగా మాట్లాడే వాడని చెప్పింది.
17ఏళ్ల నుంచే నేర ప్రపంచంలో మునిగి మోసగాడిగా పేరున్న సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య, నటి లీనా పాల్‌లపై ఢిల్లీ పోలీసులు అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, చీటింగ్, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేసింది. ఈ కేసులోని విషయాలపై స్పష్టత కోసం ఈడీ అటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇటు నోరా ఫతేహిలను ప్రశ్నిస్తున్నది. ఇప్పటి వరకైతే వీరు ఈ కేసులో నిందితులు కాదని సంబంధితవర్గాలు తెలిపాయి. అయితే, బలవంతపు వసూళ్ల ద్వారా వచ్చిన సొమ్ములో వీరేమైనా బెనిఫిట్ పొందారా? అనే కోణంలో వీరిపై ప్రశ్నలు కురిపిస్తోంది. 200 కోట్ల దోపిడీ కేసులో సుకేష్ చంద్రశేఖర్, నటి లీనా మారియా పాల్‌ను ఢిల్లీ కోర్టు మూడు రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఢిల్లీ జైలు నుంచి సాగుతున్న దోపిడీ రాకెట్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీరిని అరెస్టు చేశారు.
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
India vs Pakistan: ఆసియా కప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్.. రేపే భారత్-పాక్ ఢీ..
సుకేశ్ చంద్రశేఖర్ రూ. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో, నోరా ఫతేహి వంటి మరికొందరు ప్రముఖులను సాక్షిగా చేర్చారు. అసలు తాను ఏ నేరం చేయలేదని, ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్‌కు చిక్కినట్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటోంది. సుకేష్ చంద్రశేఖర్, అతని సహచరుడి నుండి 7 కోట్లు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు ఆమె కుటుంబం కూడా మోసగాడి నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఈడీ ఆధారాలను కూడా సమర్పించింది. జాక్వెలిన్‌తో పాటు, నోరా ఫతేహి వంటి కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సుకేష్ నుండి బహుమతులు అందుకున్నవారిలో నోరాను సాక్షిగా పేర్కొనగా, జాక్వెలిన్‌ను మాత్రం నిందితుల్లో ఒకరిగా చేర్చారు. ఇది అన్యాయమంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
పీఎంఎల్‌ఏ అప్పీలేట్ అథారిటీ ముందు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో, సాక్ష్యంలో భాగంగా సమర్పించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, నేరంతో ఎలాంటి సంబంధం లేదని, తాను సొంతంగా సంపాదించిన ఆదాయాన్నే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశానని, సుకేష్ చంద్రశేఖర్ గురించి తనకు తెలియక ముందే డిపాజిట్లు ఉన్నాయని, దర్యాప్తుకు సహకరించానని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటిషన్‌లో పేర్కొంది. ఇతరుల మాదిరిగానే మోసగాడు సుకేష్ చేతిలో మోసపోయిన బాధితురాలినని జాక్వెలిన్ వాదిస్తోంది.
ఇదిలా ఉండగా, సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో సెప్టెంబర్ 26న భౌతికంగా హాజరు కావాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!