బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.
ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ సూత్రధారిగా భావిస్తున్న రూ.200 కోట్ల కుంభకోణంలో నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆమె టీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. Read Also…