Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
- 2023 తర్వాత మార్చి నెలలో అత్యధిక వర్షపాతం నమోదం
- వాహనదారులకు ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఢిల్లీ-నోయిడా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది. రహదారులు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2023 తర్వాత మార్చి నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే అని వాతావరణ శాఖ తెలిపింది. గత మూడేళ్లలో మార్చి నెలలో ఢిల్లీలో అత్యధికంగా సగటున 9.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..
Also Read
ప్రస్తుతం ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని రోజులు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో మోస్తరు వర్షం, మెరుపులు, వడగళ్ల వానతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Off The Record: చీపురుపల్లి టీడీపీలో పరిస్థితులపై కేడర్ లో కూడా గందరగోళం
‘‘ప్రస్తుతం ఉత్తర పాకిస్థాన్.. దానిని ఆనుకుని ఉన్న జమ్మూ కాశ్మీర్‌పై ఒక పశ్చిమ అవాంతరం కేంద్రీకృతమై ఉంది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో హర్యానాపై ఏర్పడిన ఒక తుఫాను వలయం కారణంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో కూడా వర్షాలు కురుస్తున్నాయి’’ అని వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?