AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Temperature Guidelines: దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండటంతో ఎయిర్ కండిషనర్ల (ఏసీలు) వినియోగం భారీగా పెరిగింది. అయితే చాలామంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీని 18 డిగ్రీల సెల్సియస్ వద్ద నడుపుతుంటారు. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమై భారీ బిల్లులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేసి వినియోగించాలని సూచించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు.
నిపుణుల అంచనాల ప్రకారం, ఏసీ ఉష్ణోగ్రతను ప్రతి ఒక డిగ్రీ పెంచితే సుమారు 5 నుంచి 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ఈ లెక్కన 18 డిగ్రీల వద్ద నడిపే ఏసీని 24 డిగ్రీలకు పెంచితే 30 నుంచి 36 శాతం వరకు విద్యుత్ పొదుపు చేయవచ్చు. అదే 26 డిగ్రీల వద్ద నడిపితే 40 నుంచి 48 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక ఏసీని 18 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 గంటల పాటు నడిపితే 8 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందని భావిస్తే, అదే ఏసీని 24 డిగ్రీల వద్ద నడిపితే విద్యుత్ వినియోగం 5.1 నుంచి 5.6 యూనిట్లకు తగ్గవచ్చు. ఇక 26 డిగ్రీల వద్ద నడిపితే 4.2 నుంచి 4.8 యూనిట్ల మధ్య మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన, విద్యుత్ పొదుపు పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఇతర విభాగాలు విద్యుత్ వినియోగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పగటిపూట అనవసరంగా లైట్లు వెలిగించకుండా సహజ కాంతిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించింది. గదులు, కారిడార్లు, కార్యాలయాల్లో అధిక కాంతి వాడకాన్ని తగ్గించాలని పేర్కొంది. అవసరం లేని సమయంలో లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడానికి మాస్టర్ స్విచ్‌లను ఏర్పాటు చేసుకోవాలని కూడా ప్రజలకు సూచించారు. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగ భారం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్‌లో భారత్‌తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!