అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు. ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ రూ.కోటి సాయం ప్రకటించింది. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు భరిస్తోంది.
ఇదిలా ఉంటే ఉంటే తాజాగా టాటా గ్రూప్ మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇది కూడా చదవండి: Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్
మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. పరిశీలన చేయాలని టాటా గ్రూప్‌నకు సూచించినట్లు సమాచారం. ట్రస్ట్‌ను రూ.500 కోట్లతో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీన్ని టాటా గ్రూప్ ఆమోదించాలి. రెండు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒకటి భారతీయులకు.. ఇంకొకటి విదేశీ పౌరుల కోసం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ట్రస్ట్ నిధిని బాధిత కుటుంబాలకు పరిహారం, వైద్య సంరక్షణతో పాటు ప్రభావిత వైద్య పాఠశాలకు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక దర్యాప్తులో టాటా గ్రూప్ సహకరిస్తోందని తెలిపింది. కంపెనీ తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గదని ప్రతిజ్ఞ చేసింది.
ఇది కూడా చదవండి: Kerala Rains: కేరళను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.