అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు. ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ రూ.కోటి సాయం ప్రకటించింది. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు భరిస్తోంది.
Air India Plane Crash: గత వారం జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియ ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు వేగవంతంగా జరుగుతోంది. విమానంలో 242 మంది ఉంటే ఇందులో ఒక్కరు మినహా అందరూ మరణించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో, మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు.
ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది. ముంబై విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిర్ ఇండియా ఏఐసీ 129 విమానం లండన్‌కు బయల్దేరింది. 3 గంటల పాటు గాల్లోనే ఉన్న విమానం.. తిరిగి ముంబైకి చేరుకుంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం తిరిగి ముంబై వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. Also Read: Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ…
Air India: ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-183 సాంకేతిక కారణాల వల్ల రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయం (UNKL)లో ల్యాండ్ చేయబడింది ఈ మేరకు విమానయాన సంస్థ సమాచారం ఇచ్చింది.
శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు.