Maharashtra: అడవిలో హాయిగా తిరగాల్సిన వన్య ప్రాణులు.. ప్రస్తుతం ఆవాసం, ఆహరం సమస్యతో పోరాడుతున్నాయి. అడవుల్లో మానవ కార్యకలాపాల కారణంగా వన్య ప్రాణులు అడవి ధాటి జనారణ్యం లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య తిరుమలలో చిరుతలు,ఎలుగుబంట్లు కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే. అభంశుభం తెలియని ఓ పసిపాప కూడా ఈ చిరుత దాడిలో మృతి చెందింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావతం కాకూడదని ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు చేపట్టిన విష్యం అందరికి సుపరిచితమే. అయితే ప్రస్తుతం పులుల వరస మరణాలు అధికారుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి.
Read also:Papaya Seeds: బొప్పాయి గింజల్లో పుష్కలమైన విటమిన్స్.. బోలెడు ఉపయోగాలు కూడా..
వివరాల లోకి వెళ్తే.. మహారాష్ట్ర అడవులలో పులులు మృత్యువాత పడుతున్నాయి. పులుల మరణాలకు కారణాలు మాత్రం తెలియడం లేదు. దీనితో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో వరుసగా 3 పులులు చనిపోయాయి. కాగా తాజాగ చంద్రపూర్ జిల్లా బద్రావతి అటవీ క్షేత్రం లోని చపరాడ గ్రామ అడవులలో పులి మృత దేహాన్ని గుర్తించారు అధికారులు. కాగా మరణించింది ఆడ పులిగా నిర్ధారించారు. అయితే ఇలా పులులు ఎందుకు చనిపోతున్నాయి అనే విషయం పైన అధికారులు ఆరాతీస్తున్నారు. కాగా ఇలా పులులు చనిపోవడం జంతు ప్రేమికులను కలిచి వేస్తుంది. కాగా పులులు అనారోగ్యం కారణంగా చనిపోయాయా? లేక ఎవరైనా చంపేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఈ కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు.