Vijayendra Prasad Campaigns for BJP Candidates in AP: ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అన్ని పార్టీల వారు ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసిపి ఒంటరిగా బరిలోకి దిగితే తెలుగుదేశం బిజెపితో పాటు జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. ఇక పార్టీల కోసం సినిమా తారలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక బెజవాడలో సుజనా చౌదరి గెలుపు కోసం సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారత దేశ భవిష్యత్ కోసం మోడీ నీ మూడోసారి తీసుకురావటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని, మోడీకి ఓటు వేయాలని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో అదే ఉంది అన్నారు.
Danush 50: ‘రాయన్’ దిగుతున్నాడు గెట్ రెడీ.. ఇట్స్ అఫీషియల్..
మోడీ గెలుపు కోసం అనేక మంది కృషి చేస్తున్నారు, నేను నా వంతు కృషి చేస్తున్నానన్నారు. ఇక మరో పక్క కైకలూరులో కూడా కామినేని తరఫున విజయేంద్ర ప్రసాద్ ప్రచారం చేశారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆటపాక నుంచి ఏలూరు రోడ్డు వరకు రోడ్ షో ద్వారా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయేంద్ర ప్రసాద్. ఇక కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.