ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలు వెలుగు చూశాయి. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్ట్ లో హాజరు పరచగా.. అనంతరం రిమాండ్ కు తరలించారు. ధర్బంగా బ్లాస్ట్ కేసుల నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు పాకిస్థాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. లష్కరే తోయిబా కు చెందిన ముఖ్యనేత ఆదేశాల మేరకే హైద్రాబాద్ కు వచ్చారు మాలిక్ బ్రదర్స్. సికింద్రాబాద్ ధర్బంగా ఎక్స్ప్రెస్ లో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్రపన్నారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఐఎస్ఐ ముఖ్య నేత ఇక్బాల్ ఈ వ్యూహ రచన చేసాడు.
2012 లో పాకిస్థాన్ వెళ్లిన ఇమ్రాన్ మాలిక్ ను ఉగ్ర కుట్ర కు శిక్షణ ఇచ్చారు ఇక్బాల్. మాలిక్ సోదరులతో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీం, ఖాఫిల్ కు కూడా ఇక్బాల్ శిక్షణ ఇచ్చాడు. 2016 లో ఈ నలుగురు దుబాయ్ కి వెళ్లినట్టు గుర్తించిన ఎన్ఐఏ ఇక్బాల్ తో తరచూ సోషల్ మీడియా లో సంభాషణ చేస్తూనే ఉన్నారు ఇమ్రాన్ మాలిక్. బాంబ్ తయారీలో రసాయనాల వాడకం పై యూ ట్యూబ్ లో వీడియోల లింక్ ను ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… పేలుడు కు సల్ఫ్యూరిక్ గా యాసిడ్,నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ఉపయోగించారు మాలిక్ బ్రదర్స్. హైద్రాబాద్ లోని చిక్కడ పల్లి, హాబీబీనగర్ లో ముడిసరుకులు కొన్న మాలిక్ బ్రదర్స్… మొదట ఇంట్లో ట్రైల్స్ నిర్వచించారు ఉగ్రవాదులు.
Also Read
అయితే ఈ ట్రైల్స్ సక్సెస్ కావడంతో ఒక టానిక్ సీసా లో రసాయనాలతో మూడింటిని ఉపయోగించి పార్సిల్ లో అమర్చిన మాలిక్ సోదరులు… 16 గంటల లోపు ట్రైన్ లో పేలుడు జరిగేలా స్కెచ్ వేశారు. పేలుడు రసాయనాన్ని 50 మిలి లీటర్ల పెట్టడంతో పెద్ద గా భారీ కుట్ర ఫెయిల్ అయ్యింది. దర్భంగా స్టేషన్ లో పార్సిల్ దించే సమయంలో పార్సిల్ కింద పడటంతో పేలుడు సంభవించింది. పార్శిల్ పంపిన వ్యక్తి పేరు సుఫియాన్ పాన్ కార్డ్ ను వాట్సప్ లో ఇమ్రాన్ కు పంపిన ఇక్బాల్… హైదరాబాధ్ మల్లేపల్లిలో నివాసం ఏర్పచుకున్నారు మాలిక్ ఉగ్రవాద సోదరులు. భారీ పేలుడుకు ముందు ఇది శాంపిల్ కుట్రనా అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ దృష్టి మలిచి మరో విధ్వంసం కు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!