IPS Officer Suicide: ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష.. ఉన్నతాధికారిపై ఐఏఎస్ ఫిర్యాదు
- హర్యానాలో దళిత ఐపీఎస్ అధికారిని బలి తీసుకున్న కుల వివక్ష..
- పోలీస్ శాఖలో అక్రమాలను బయట పెట్టిన ఐపీఎస్ పూరన్ ను టార్చర్ చేసిన సీనియర్స్..
- తన భర్త ఆత్మహత్యకు గల సీనియర్ అధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలి: ఐఏఎస్ అమనీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Officer Suicide: హర్యానా పోలీసు శాఖలో కుల వివక్ష తెలుగు వ్యక్తి ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు మానసికంగా వేధించడం భరించలేక ఐపీఎస్ ఆఫీసర్ ఏడీజీపీ వై పూరన్ కుమార్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇక, మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్ సెక్టార్ 11లోని తన బావమరిది నివాస భవనం సౌండ్‌ప్రూఫ్ బేస్మెంట్లో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో ఉన్న పూరన్ కుమార్ మృతదేహాన్ని అతడి కుమార్తె గుర్తించింది. పోలీసు శాఖలో కుల వివక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడిన పూరన్.. దీంతో పలువురు సీనియర్ అధికారులు పగబట్టి వేధించడంతో.. చివరకు ఓ లంచం కేసులో ఇరికించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వారు తనను మానసికంగా ఎలా వేధించిందీ అనే దానిపై 8 పేజీల సూసైడ్ నోట్లో రాశారు.
Read Also: Telangana Local Body Elections 2025: మోగిన ఎన్నికల నగారా.. తొలి నోటిఫికేషన్ విడుదల..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
కాగా, తన కెరీర్‌ను సర్వనాశనం చేయడానికి కుట్ర పన్నారని ఐపీఎస్ ఏడీజీపీ వై పూరన్ కుమార్ పేర్కొన్నారు. ఆ అధికారులు ఎవరనేది మాత్రం చండీగఢ్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. వారిలో కొందరు రిటైరైన అధికారులు కూడా ఉన్నట్లు టాక్. ఈ వేధింపులకు తోడు తాజాగా ఓ మద్యం కాంట్రాక్టర్ కంప్లైంట్ తో నమోదైన లంచం కేసులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అతడి పేరును కూడా అందులో చేర్చారు. ప్రాధాన్యం లేని పోస్టుకు ట్రాన్స్ ఫర్ చేయడంతో.. కలత చెందినట్లు సమాచారం. పూరన్ కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నారని ఆ లిక్కర్ కాంట్రాక్టర్ ఫిర్యాదులో తెలిపాడు. దాంతో రోహతక్ పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆయన పేరును కూడా చేర్చారు. సొంత శాఖలో కుల వివక్ష, అక్రమాలు, అన్యాయాలను బయట పెట్టినందుకే కుమార్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా, పూరన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. 2001 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారి.. 2008లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
Read Also: విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్‌కి జగన్ ప్రయాణం, ముఖ్య పర్యటనకు మాజీ సీఎం రెడీ
అయితే, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులపై జరుగుతున్న వివక్షపై ఎన్నికల కమిషన్‌ను పూరన్ కుమార్ ఆశ్రయించారు. తాను ప్రభుత్వానికి సన్నిహితుడినని చెప్పుకున్న ఓ ఐపీఎస్ అధికారికి గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టింగు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేశాడు. అలాగే, ఐపీఎస్ అధికారుల పదోన్నతుల్లో అక్రమాలపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి లేఖ కూడా రాశారు. దీంతో ఉత్తమ సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా కుమార్ పతకం అందుకున్నారు. పూరన్ భార్య అమనీత్ కుమార్ 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం సైనీ అధికారుల బృందంలో ఆమె ఒకరు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్.. సీఎం యోగిని ఘోరంగా తిట్టిన ముస్లిం యువకులు(వీడియో)
కాగా, ఐఏఎస్ అధికారిణీ అమనీత్ మాట్లాడుతూ.. సీనియర్ అధికారుల వేధింపులతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. తక్షణమే శత్రుజీత్ సింగ్ కపూర్, నరేంద్ర బిజార్నియా అనే ఇద్దరు అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే వారు పూరన్ కుమార్ ని టార్చర్ చేశారు, ఉన్నత పదవిలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నా భర్త సూసైడ్ కేసులోని అన్ని సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసి, దర్యాప్తును అడ్డుకుంటారు అని ఆమె ఆరోపించింది. నేను నా కుటుంబం కోసం మాత్రమే కాదు, ప్రతి నిజాయితీ గల అధికారి గౌరవం కోసం వేడుకుంటున్నాను అన్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కేసు కాదు, నా భర్త – ఎస్సీ వర్గానికి చెందిన అధికారిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని తెలిపింది. కొందరు సీనియర్ అధికారులు నా భర్తపై సంవత్సరాల తరబడి అవమానం, వేధింపులకు గురి చేశారని ఐఏఎస్ అధికారిణి అమనీత్ కన్నీరు పెట్టుకుంది.
తాజావార్తలు
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!