Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cyclone Ditwah Batters Tamil Nadu Red Alert For South Coast And Puducherry Heavy Rains Flights Cancelled

Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!

Published Date :November 30, 2025 , 8:20 am
By Sampath Kumar
  • తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా
  • అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు
  • దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్
Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి.

నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిమీ దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిమీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గత 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో ఉత్తరం వైపుకు కదిలి.. కారైకల్ కు తూర్పున 80 కిమీ, జాఫ్నాకు ఈశాన్యంగా 140 కిమీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 160 కిమీ, చెన్నై దక్షిణంగా 250 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Also Read: IND vs SA: నేడే తొలి వన్డే.. చాన్నాళ్ల తర్వాత బరిలోకి రో-కో! గంబీర్‌కు ప్రియమైన వ్యక్తికి చోటు

రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తుఫాను ఈరోజు ఉదయం లేదా సాయంత్రం నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతంలో 50 కిమీ-25 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈరోజు దక్షిణ కోస్తాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్పారు. సోమవారం దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bay of Bengal
  • chennai
  • Cyclone Ditwah
  • Cyclone Ditwah Live
  • Cyclone Ditwah Updates

తాజావార్తలు

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. డైరెక్ట్ లింక్.. ఇక్కడ క్లిక్‌ చేయండి..

  • 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్

  • Trump: “అలా చేస్తే నా నెక్ట్స్‌ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions