ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి కోకైన్ పట్టుబడటం సంచలనంగా మారింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా నేరగాళ్లు మాత్రం డ్రగ్స్ సప్లయ్‌కు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా సిని ఫక్కీలో కోకైన్ ను తరలించే యత్నం చేసిన కిలాడి లేడిని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోకైన్ను చిన్న చిన్న క్యాప్సెల్స్లో నింపి కడుపులో దాచిన కిలాడిలేడీ ఆటలు కస్టమ్స్ అధికారుల వద్ద సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 91 క్యాప్ సెల్స్‌ను ఈ కిలాడి లేడి మింగింది. ఉగాండాకు చెందిన ఈ మహిళ నుంచి రూ.14 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.లాగోస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికురాలి నడవడికలో అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. కస్టమ్స్ ముందు నోరు విప్పకుండా బయటకు వెళ్లే యత్నంలో కుప్పకూలి పోయిన ప్రయాణికురాలు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారుల బృందం. ఈ కిలాడి లేడికి డాక్టర్లు ప్రాణాలకు ముప్పు ఉందని ఏం జరిగిందో చెప్పాల్సిందేనని అనడంతో చివరికి నోరు విప్పి అసలు నిజం చెప్పింది. కొకైన్‌తో నింపిన 91 క్యాప్ సెల్‌ను మింగినట్టు వైద్యులకు తెలిపింది.
వారం రోజుల చికిత్స అనంతరం ప్రయాణికురాలిని ప్రాణాలతో కాపాడిన వైద్యులు కడుపులో ఉన్న 91 కొకైన్ క్యాప్ సెల్స్‌ను బయటకు తీశారు. ప్రయాణికురాలిని వైద్యులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండడంతో కొకైన్ ను ఢిల్లీకి తరలించే యత్నం చేసినట్లు సమాచారం. ఢిల్లీలో కొకైన్ ఎవరికీ ఇవ్వడానికి తెచ్చింది అనే సమాచారాన్ని కస్టమ్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఒకే సారి 91 క్యాప్ సెల్స్ కొకైన్ కడుపులో దాచి తరలించే యత్నం చేయడం మొదటి సారి అని కస్టమ్స్ అధికారులు తెలిపారు.