కరోనాపై పోరులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. రాబోయే పండుగ సీజన్లు మరియు కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని, ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్ & వ్యాక్సినేషన్’పై దృష్టి సారించాలని కోరింది కేంద్రం. మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత మరియు శారీరక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్ నియమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం.