COVID 19: వరసగా రెండో రోజు 20 వేలకు పైగా కేసులు..పెరిగిన మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల కన్నా అధికంగానే కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన ఒక రోజులో కరోనా మహమ్మారి వల్ల 47 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 1,39,073 కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 16,994 కోవిడ్ నుంచి కోలుకున్నారు. అంతకుముందు రోజుతో పోలిస్తే డైలీ పాజిటివిటీ రేటు తగ్గింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. అంతకుముందు రోజు ఇండియాలో 20,139 కేసులు నమోదు అయ్యాయి.
Also Read
Read Also: Ts Si Prelims Exam Postponed: ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!
కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 5,25,604 మరణించగా..4,30,45350 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.31గా ఉండగా.. రికవరీ రేటు 98.49 శాతంగా, డెత్ రేట్ 1.20 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 199,47,34,994 డోసులు టీకాను ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 18,92,969 వ్యాక్సినేషన్ ఇచ్చారు. నేటి నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?