Covid 19: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona cases in india: దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,395 మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఇండియాలో కేవలం 5,379 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. 98.7 శాతం రికవరీలు పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50,342 కు పడిపోయింది. మొత్తం కేసులో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 0.11 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా 4,44,72,241 కరోనా కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 5,28,090 చనిపోగా… 4,39,00,204 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Corona: కోవిడ్ ప్రమాదాన్ని విటమిన్-డి తగ్గించలేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి
దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 214.27 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 36,31,977 కరోనా వ్యాక్సినేషన్ అందించారు. 3,25,602 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇక ప్రపంచంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రోజుకు అక్కడ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61,18,59,477 కేసులు నమోదు కాగా వీరిలో 65,09,112 మంది మరణించారు. 58,94,63,266 మంది కోలుకున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!