Corona cases in india: దేశంలో కరోనా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దీంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య 10 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 64,667కి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 10,828 మంది కోలుకున్నారు. వ్యాధిబారిన పడి మరో 45 మంది మరణించారు.
Read Also: Rashid Khan: అరుదైన ఘనత సాధించిన ఆఫ్ఘన్ స్పిన్నర్
మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.15 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,065 యాక్టివ్ కేసులు తగ్గాయి. రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంటే.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో కరోనాతో చనిపోతున్న వారిలో కేరళ రాష్ట్రం నుంచే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా మరణించిన 45 మందిలో పదిమంది కేరళ రాష్ట్రానికి చెందిన వారే. మహారాష్ట్రలో 8 మంది, ఢిల్లీ, కర్ణాటక నుంచి ముగ్గురు చొప్పున.. ఇతర రాష్ట్రాల నుంచి మరికొంత మంది మరణించారు.
దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,44,28,393 మందికి కరోనా సోకింది. ఇందులో 4,38,35,852 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 5,27,874 మంది మరణించారు. మరోవైపు ఇండియా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 212.39 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 22,50,854 మందికి టీకాలు అందించారు.