Corona Cases In India: ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు 15-20 వేల మధ్య నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కేసుల సంఖ్య 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతోంది. దీంతో పాటలు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగివస్తోంది. రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 736 కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేల కన్నా దిగువన 87,311గా నమోదు అయ్యాయి. ఇక నిన్న ఒక్క రోజే కోవిడ్ బారిన పడి 41 మంది మరణించారు.
Read Also: Sonali Phogat Case: బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసులో డ్రగ్ డీలర్ తో సహా మరొకరి అరెస్ట్
మరణించిన 41 మందిలో కేరళలో నాలుగు మరణాలు సంభవించగా.. హర్యానాలో 6, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో 4 మరణాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు, ఢిల్లీ, గుజరాత్, ఒడిశా నుంచి ఇద్దరు చొప్పున, చండీగఢ్, గోవా, జమ్మూ కాశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 4,43,98,696 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 5,27,597 మంది మరణించారు.. 4,37,83,788 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.62గా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. రోజూవారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 2.50 శాతానికి దిగివచ్చింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.80 శాతంగా ఉంది.
ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. దేశంలో 211.91 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 25,86,805 మందికి టీకాలు అందించారు. ఇండియాలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి గమనిస్తే డిసెంబర్ 19, 2020న కోటి కరోనా కేసుల మార్కును అధిగమిస్తే.. మే 4, 2021 రెండు కోట్ల కేసులు, జూన్ 23, 2021లో మూడు కోట్ల కేసులు, జనవరి 23,2022న నాలుగు కోట్ల మార్క్ ను చేరుకున్నాయి కరోనా కేసులు.