Couple’s fight over ‘cooking mutton on Tuesday’ kills neighbour: సాధారణంగా ఇరుగుపొరుగు కుటుంబాలు ఎంతోకొంత స్నేహంగా ఉంటాయి. కొన్ని సార్లు గొడవులు జరిగితే సర్దిచెబుతుంటారు పక్కింటి వారు. అయితే ఈ ఘటనను చూస్తే వేరేవారి విషయాల్లో కలుగుజేసుకోవాలనుకునే పొరుగింటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యభర్తల గొడవలను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
Read Also: Madhya Pradesh:చిన్నారి మృతదేహంతో మేనమామ.. టిక్కెట్ కి కూడా డబ్బుల్లేవు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన వ్యక్తి తన భార్యతో గొడవ పడుతున్న సమయంలో జోక్యం చేసుకున్న వ్యక్తిని కొట్టి చంపాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మంగళవారం రోజు మటన్ వండాలని పప్పు అయిర్వార్ అతని భార్యతో గొడవకు దిగాడు. అయితే ఈ గొడవను ఆపేందుకు పొరుగింటి బిల్లు అనే వ్యక్తి ప్రయత్నించాడు. చాలా మంది హిందువులు మంగళవారాన్ని పవిత్రంగా భావిస్తారు. మాంసం జోలికిపోరు. ఈ నేపథ్యంలో పప్పు భార్య కూడా మటన్ వండేందుకు నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
భార్యభర్తలిద్దరు గొడవ పడుతున్న శబ్ధం విన్న బిల్లు గొడవను పరిష్కరించడానికి వెళ్లాడు. సమస్యను పరిష్కరించి పప్పు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చాడు. మా గొడవ మధ్యలోకి బిల్లు రావడాన్ని సహించని పప్పు అతని ఇంటికి వెళ్లి కొట్టి చంపాడు. బిల్లు మరణం తర్వాత అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పప్పుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.