Madhya Pradesh:చిన్నారి మృతదేహంతో మేనమామ.. బస్ టిక్కెట్ కి కూడా డబ్బుల్లేక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో కంటతడి పెట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లభించడంలేదు. ఉన్నా సిబ్బంది వేలల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో మృతదేహాలను తరలించేందుకు బాధిత కుటుంబీకులు నానావస్థలు పడుతున్నారు. తాజాగా అంబులెన్స్ లేకపోవడంతో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల మేన కోడలి మృతదేహాన్ని భుజాన వేసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. రద్దీగా ఉండే రోడ్డులో బస్టాప్ వైపు నడుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Smart Phone : స్మార్ట్ ఫోన్ కోసం రక్తాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 16ఏళ్ల బాలిక
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, తిరిగివచ్చే సమయంలో చిన్నారి సమీపబంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎటువంటి ప్రభుత్వ వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే.. వేలల్లో డబ్బులు డిమాండ్ చేశారు. చేసేదీలేక సరిపడా డబ్బులు లేక.. చిన్నారి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ బస్టాండ్‌కు వెళ్లాడు ఆ వ్యక్తి. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడు ఒకరు సహాయం చేశారు. ‘మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడం పట్టణాభివృద్ధి శాఖ పని… ఆసుపత్రిని, వైద్యులను ఇందులోకి లాగవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాను, ”అని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ చెప్పాడు.
Read Also: Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట
నాలుగు నెలల క్రితం ఇదే ఆసుపత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఛతర్‌పూర్ జిల్లాలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT
— Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!