NTV Telugu Site icon

India vs Canada: మన ప్రయోజనాలే ముఖ్యం.. మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు..

India Vs Canada

India Vs Canada

India vs Canada: ఖలిస్తానీ వేర్పాటువాదానికి మద్దతు నిలుస్తున్న కెనడా తీరుపై భారతదేశం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇదిలా ఉంటే కెనడా పౌరుడు, ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం, ఆ దేశ విదేశాంగ మంత్రి భారత అత్యున్నత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే కెనడా వాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. ఇండియాలో కెనడా రాయబారిని భారతవిదేశాంగ పిలిచి, కెనడా నిర్ణయంపై తీవ్రంగా ఆక్షేపించింది.

Read Also: Sonia Gandhi: “ఈ బిల్లు మాదే”.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ..

ఇదిలా ఉంటే ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దేశప్రయోజనాలు, ఆందోళలకే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. ‘‘ఉగ్రవాదంపై మన దేశం యొక్క పోరాటం రాజీపడదని భారత జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రత్యేకించి ఉగ్రవాదం భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నప్పుడు, మన దేశ ప్రయోజనాలు, ఆందోళనలు అన్ని వేళలా ముఖ్యమైనవిగా ఉండాలి’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. దేశ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంతో విభేదించినప్పటికీ, అంతర్జాతీయ సమస్యలపై మద్దతు ఉంటుందని కాంగ్రెస్ తెలిపింది.

జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే దీనిపై అక్కడి ఖలిస్తాన్ వేర్పాటువాదులు, రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ భారత్ దేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం, భారత వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం, కెనడాను పలుమార్లు కోరింది. అయినా ట్రూడో ప్రభుత్వం దీనిపై మెతక వైఖరి అవలంభిస్తోంది. ఇటీవల జీ20 సమావేశాలకు ట్రూడో భారత్ వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ తన ఆందోళనను తెలియజేశారు. ఈ పర్యటన అనంతరం కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది.