Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది.
కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందు కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా చెప్పారు.