Site icon NTV Telugu

Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ బిగ్ షాక్..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానికి ఈ విషయాన్ని తెలియజేసిందని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ముంబైతో సహా 246 మునిసిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో అసిమ్ మునీర్ సైనిక తిరుగుబాటు.. సైన్యం లేకుండానే పని కానిచ్చేశాడు..

అయితే, ఈ నిర్ణయంపై ఎంవీఏ కూటమి భాగస్వాముల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. శివసేన (UBT) ప్రతినిధి ఆనంద్ దూబే, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చేసిందని విమర్శించారు. మహారాష్ట్రలో ఇతర పార్టీలను నిందించే ముందు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) ఎవరిపైనా ఆధారపడకుండా సొంతగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శివసేన(UBT), మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (MNS) మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై కాంగ్రెస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంఎన్ఎస్ కూటమిలో చేరితే మైనారిటీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఓట్లు పోతాయని కాంగ్రెస్ చెబుతోంది.

ప్రతిపక్ష కూటమిలో విభేదాలపై అధికార బీజేపీ విమర్శలు చేసింది. ఎంవీఏ పూర్తిగా గందరగోళంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకత్ అన్నారు. ఉద్ధవ్ లాగే, రాజ్ ఠాక్రే కూడా హిందుత్వానికి దూరమవుతున్నారని అన్నారు. ఎన్నికల ముందే రెండు పార్టీలను కాంగ్రెస్ వదిలేస్తోందని చెప్పారు. డిసెంబర్ 2న మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.

Exit mobile version