PM Modi: రాహుల్ గాంధీది మావోయిస్టు భాష.. మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకపడ్డారు. బెంగాల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఇద్దరు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. షెహజాదా మావోయిస్టు భాష వాడటం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయిన పెట్టుబడులు పెట్టేందుకు 50 సార్లు ఆలోచిస్తారని అన్నారు. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ మావోయిస్టులు మాట్లాడే భాషను ఉపయోగిస్తున్నారని, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడతారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ పారిశ్రామిక వ్యతిరేక వ్యాఖ్యల్ని అంగీకరిస్తారా..? అని ప్రధాని ప్రశ్నించారు.
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
Read Also: Arvind Kejriwal: ‘‘ఆపరేషన్ ఝాదూ’’.. ఆప్‌ని అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది..
మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆదివారం మండిపడ్డారు. ఒక వర్గం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి సామాజిక-మత సంస్థల్ని బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. పురూలియాలో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. టీఎంసీ ‘‘ఇస్కాన్, రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోంది’’ అని, ఇలా నీచంగా మాట్లాడటం ద్వారా మర్యాద పరిమితులను అతిక్రమించిందని అన్నారు.
ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బిజెపి నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారు. దేవాలయాలను చూసుకునే వారు గొప్ప ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు, కానీ కొందరు అలా చేయడం లేదు అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!