Chidambaram: ఎంపీలను అర్థరాత్రి వరకు పీఎస్‌లలో ఉంచి వేధించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు పి.చిదంబరం, మల్లిఖార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని విచారించిన తీరు, కాంగ్రెస్ ఎంపీల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన వైఖరిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఫిర్యాదు కూడా చేశారన్నారు.
ఎంపీలను అరెస్ట్ చేస్తే చట్టసభల అధిపతులకు తెలియజేయాలని కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం అన్నారు. ఎంపీలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్బంధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు ఎంపీలను ఉంచి వేధించారని.. వారిని అవమానించారని ఆయన మండిపడ్డారు. సభా హక్కుల సంఘం ఈ విషయంపై విచారణ చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ సభ్యుల హక్కులకు భంగం కలిగిందన్నారు. పోలీసుల జులుంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు.
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆమె ట్విటర్లో వీడియోను పోస్ట్ చేసింది. తన బట్టలు చిరిగేలా ప్రవర్తించడంతో పాటు కనీసం తాగడానికి నీరు అందించాలని అడిగినా ఒప్పుకోలేదని.. బయట షాపుల నుంచి వాటర్ బాటిల్స్ కొందాం అని అనుకున్నా.. నీరు ఇవ్వొద్దని షాపు యజమానులను ఆదేశించారని, బస్సులో నాతో పాటు 7-8 మంది మహిళా ఎంపీలు ఉన్నారని ఆమె వీడియో తీసి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Congress: మహిళా ఎంపీ బట్టలు చింపేయడం దారుణం.. శశిథరూర్ ట్వీట్
అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. ‘‘ ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇలా చేయడం దారుణం అని.. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం భారతీయ మర్యాదను ఉల్లంఘించడమే అని.. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తనను ఖండిస్తున్నానని, స్పీకర్ ఓం బిర్లా దీనిపై చర్య తీసుకోవాలని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్‌కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!