Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని ఆయన అన్నారు.
Read Also: Pushpa 2: ఇండియా సినిమాల్లో రికార్డు.. పుష్ప 2 ఆడియో రైట్స్ కు భారీ ఆఫర్
మహరాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఆయన ఆత్మకథలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని భూములు కాపాడుకోలేని భూస్వామిగా పవార్ అభివర్ణించాడు. కాంగ్రెస్ పార్టీ గత వైభవాల గురించి ప్రగల్భాలు పలుకుతున్నారని నిందించారు. మహారాష్ట్రలొో సంక్షీర్ణం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ తన సహనాన్ని పరీక్షించిందని తెలిపారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ వైఖరి వల్ల సంక్షీర్ణాన్ని కొనసాగించలేనని తాను భావించాని ఆత్మకథలో పేర్కొన్నారు.
శరద్ పవర్ తన పుస్తకంలో నరేంద్ర మోదీతో తనకు ఉన్న సంబంధాలను గురించి ప్రస్తావించారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వానికి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి మధ్య తాను వారధిగా నిలిచినట్లు శరద్ పవార్ వెల్లడించారు. గుజరాత్ ప్రజలకు నష్టం జరగకూడదనే, చొరవ తీసుకుని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లడినట్లు తెలిపారు. నరేంద్రమోదీతో తన సంబంధాలు 10 ఏళ్ల క్రితం నుంచే ప్రారంభమయ్యాయి అని తెలిపారు.ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి పోరాటం లేకుండా రాజీనామా చేయడం వల్ల మహా వికాస్ అఘాడి అధికారానికి ముగింపు పలికిందని పేర్కొన్నారు.