రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు…