Site icon NTV Telugu

Congress Minister: ఢిల్లీ పేలుడుతో బీజేపీకి సంబంధం ఉందా.? కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Karnataka Ministar

Karnataka Ministar

Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కారు బాంబు జరగాల్సింది కాదు. బాంబు పేలుడు నవంబర్ 10న జరిగింది. నవంబర్ 11న బీహార్ ఎన్నికలు జరిగాయి’’ అని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందే ఈ పేలుడు ఎందుకు జరిగిందని అనుమానించారు. ఢిల్లీ పేలుడు నిందితులకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని జమీర్ అహ్మద్ అన్నారు.

Read Also: Vijayawada Crime: భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించిన భర్త..!

బీజేపీ, ప్రధాని మోడీ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లవచ్చని చెబుతున్న నేపథ్యంలో ఈ సందేహం తలెత్తినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇస్లాంలో ఎక్కడా ఉగ్రవాదంలో పాల్గొనాలని చెప్పలేదని, ఉగ్రవాదంలో పాల్గొనే వారు ముస్లింలు కారని ఆయన అన్నారు. బీహార్‌లో ఎన్నికల ముందు ఒక రోజు ఈ సంఘటన ఎందుకు జరిగిందో దర్యాప్తు ద్వారా మాత్రమే తెలుస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్నికల సమయంలో దేశంలో ఉగ్రవాద దాడులకు కారణం ఏమిటి.? అని ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్రం పూర్తి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవి దిగజారిన రాజకీయాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ ఆరోపించింది.

Exit mobile version