Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.