NTV Telugu Site icon

PM Modi: పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తుందని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని విపక్ష పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం కోసం ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ హస్తం పార్టీ వ్యతిరేకించిందన్నారు. అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పుకొచ్చింది.. జమ్మూకశ్మీర్‌లో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయాడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అలాగే, పార్లమెంట్‌, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును నిరాకరించింది అని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

Read Also: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్

ఇక, దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైంది అని ప్రధాని మోడీ అన్నారు. కానీ, తమ కుటుంబాన్ని మరింత బలోపేతం చేసేందుకే శ్రమించిందని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లోని దేశభక్తిని నాశనం చేసేందుకు హస్తం పార్టీ ట్రై చేస్తోంది.. ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే.. కాంగ్రెస్‌ గెలుపు కూడా అంతే కష్టంగా మారుతుందని భావిస్తోంది. అందుకే దేశభక్తుల ఐక్యతను నాశనం చేసేందుకే ఆ పార్టీ యత్నిస్తోంది ఆయన పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది.. ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ అనుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: US-Israel: ఇజ్రాయెల్‌కు అమెరికా అలర్ట్.. ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక

కాగా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్‌ చెప్తుంది.. కానీ, పాక్‌ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు. ఇక, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.