NTV Telugu Site icon

Haryana Polls: సాయంత్రం మరో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్.. ముగ్గురు ఎంపీల పోటీపై ఉత్కంఠ!

Congress

Congress

హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ముగ్గురు.. ఎమ్మెల్యేలకు పోటీ చేస్తామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలు మినహా.. మిగతా అన్ని స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను వెల్లడించనున్నట్లు సమాచారం. మూడు స్థానాల ఎంపిక మాత్రం అధిష్టానానికి వదిలేసిట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసినట్లు కూడా వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు, రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా ఉన్నారు. అయితే ఎంపీలకు సీట్లు కేటాయింపుపై హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఇప్పటికే 41 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 49 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది.

హర్యానాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు.. లోక్‌సభలో కొనసాగే కంటే.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఐదేళ్ల పాటు అధికారం చెలాయించవచ్చని ఎంపీలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. బీజేపీ, ఆప్ కూడా జాబితాలను వెల్లడించాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.