భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్ధరాత్రి నియమించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది.