Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..

  • ఇజ్రాయిల్‌కు భారత్‌లో విపరీతమైన మద్దతు
  • నెతన్యాహూ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు.
  • “ఇజ్రాయిల్‌కు మోదీ బేషరతు మద్దతు ఇస్తున్నారు”: అని జైరాం రమేష్
Modi Netanyahu

Modi Netanyahu

Congress: ప్రపంచం వ్యతిరేకిస్తున్నా, భారత్‌లో తమకు భారీ మద్దతు దొరుకుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. భారత్ నుంచే తమకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, భారత్‌లో ఇజ్రాయిల్ అంటే క్రేజ్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య సారా న్యూఢిల్లీలో 2018లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ నుంచి ఆప్యాయమైన స్వాగతాన్ని అందుకున్నట్లు చెప్పారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్‌కు అందిస్తున్న మద్దతు ‘తీవ్రమైన నైతిక పిరికితనం’’గా అభివర్ణించారు. శుక్రవారం ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. మోడీ వైఖరి భారత మౌలిక విలువలకు ద్రోహంగా అభివర్ణించింది. చాలా మంది భారతీయులకు ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

×
×
Ad

ఇజ్రాయిల్ ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందిస్తూ.. నెతన్యాహూ వ్యాఖ్యలు పూర్తి భారతదేశానికి వర్తించమని అన్నారు. మధ్యప్రాచ్యంలోని వివాదాలపై మోడీ మైనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు, లెబనాన్‌పై దాడులు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో లక్షలాది మంది పాలస్తీనియన్లను బలవంతంగా పారద్రోలడాన్ని ఎందుకు మోడీ ఖండించడం లేదని ఫైర్ అయ్యారు.

2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా భారీ వైమానిక దాడులు చేయడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోడీని నెతన్యాహూ ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించడంలో భారత్ విఫలమైందని ఆరోపించారు. మోడీ నెతన్యాహూకు బలమైన మద్దతుదారుగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిల్ ప్రయోజనాలు ఇప్పుడు ‘‘మోదానీ’’ కార్పొరేట్‌తో గాఢంగా మారాయని ఆరోపించారు. ఈ మద్దతు కోట్లాది భారతీయులకు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదని జైరామ్ రమేష్ అన్నారు.