Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
- మోడీ సర్కార్‌కు కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటం..
- జూన్ 13లోగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్..
- జూన్ 20న దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్న బొద్దింకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ మోడీ సర్కార్‌కు అల్టిమేటం విధించింది. జూన్ 13 లోగా విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, జూన్ 20న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల్లో పదేపదే జరుగుతున్న అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు.
పూణేలో జరిగిన విలేకరుల సమావేశంలో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై దేశ యువత మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేరని అన్నారు. జూన్ 13 లోగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని హెచ్చరించారు. నీట్ పరీక్ష రద్దు తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దీప్కే అన్నారు. నీట్, సీబీఎస్ఈ, సీయూటీ వంటి పరీక్షలకు సంబంధించిన సమస్యల వల్ల కోటికి పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారని, దీనికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని ఆరోపించారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జూన్ 06న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించారు. జూన్ 13వ తేదీలోగా రాజీనామా చేయకపోతే పూణేలో ఉద్యమం మొదలవుతుందని, జూన్ 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూణేలో శాంతియుత నిరసన జరుగుతుందని, ఆ తర్వాత లక్నో, అమృత్సర్, జైపూర్, బెంగళూర్‌లో నిరసన నిర్వహిస్తామని దీప్కే చెప్పారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకుంటారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించగలిగితే, విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించగలరని అన్నారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!