Yogi Adityanath: సినిమా ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్‌లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని యోగి అన్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు రవి కిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్, సోనూ నిగమ్‌ల, బోనీ కపూర్, సుభాష్ ఘయ్ సహా ఇతర ప్రముఖులు సీఎం యోగితో సమావేశానికి హాజరయ్యారు.
Read Also: Dhamaka: మొత్తానికి రవన్న సెంచరీ కొట్టేసాడు రోయ్…
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
అటు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, ప్రజలకు చేరువ కావడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి సారిస్తారని సీనియర్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను తొలగించి బాలీవుడ్ పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆయన యూపీ యోగి ఆదిత్యనాథ్ సాయం కోరారు. బుట్టలో కుళ్ళిన ఆపిల్ ఉండవచ్చు.. కానీ మనమందరం అలా కాదన్నారు. మన కథలు, మన సంగీతం ప్రపంచానికి కనెక్ట్ అవుతాయని.. కాబట్టి కళంకం తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దయచేసి ఈ సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేయాలని సీఎం యోగిని సునీల్ శెట్టి కోరారు.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!