CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
- కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి సీజేపీ మద్దతు..
- జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 10 లక్షల మందితో ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది. ఈ మేరక సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రం ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమని, ప్రభుత్వం తన ఓటర్లను ఎంపిక చేసుకోవడం కాదని సీజేపీ పేర్కొంది. నిష్పక్షపాత ఎన్నికలను పర్యవేక్షించాల్సిన బాధ్యతలో ఉన్న జ్ఞానేశ్ కుమార్ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించే విషయంలో సీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
- Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
- PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
- Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
భారత రాజ్యాంగం ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, ఆ హక్కు నుంచి ఏ ఒక్క అర్హుడైన పౌరుడూ దూరం కాకుండా చూడటమే మన బాధ్యత అని, మన దేశంలో స్వేచ్చాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికల కోసం పోరాడుతున్న అన్ని సంస్థలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటిస్తోందని దీప్కే ప్రకటించారు.
GYANU MUST GO!
The Cockroach Janta Party extends its support to the INDIA Bloc’s November 1 rally.
Nation above all!
#JaiBhim #JaiHind https://t.co/jbSsRQeHEw
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 28, 2026
తాజావార్తలు
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!