China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు
Chinese woman arrested on allegations of spying: తన గుర్తింపు దాచి పెడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై గురువారం ఓ చైనా మహిళను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ.. చైనా తరుపున గూఢచర్య చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపు కార్డుతో భారతదేశంలో నివసిస్తూ.. దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చైనా మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Pakistan: తల్లిని పట్టుకుని ఏడ్చిన హిందూ బాలిక.. వెనక్కి తగ్గిన పాకిస్తాన్ కోర్టు..
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన కై రువోగా పోలీసులు గుర్తించారు. బౌద్ధ సన్యాసిని ముసుగులో డోల్మా లామాగా పేరు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ మజ్ను కా తిలాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంప్రదాయ బౌద్ధ సన్యాసి ధరించే దుస్తుల్లో మహిళ ఉంది. ఆమె నుంచి డోల్మా లామా పేరుతో నేపాల్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విచారించినప్పుడు సదరు మహిళ చైనా పౌరురాలని తేలిందని.. 2019లో భారత దేశానికి వచ్చినట్లు గుర్తించారు.
ఆమెపై ఐపీసీ సెక్షన్లు 120 బి (నేరపూరిత కుట్ర), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (మోసం చేయడం), 467 (సెక్యూరిటీని ఫోర్జరీ చేయడం) కింద కేసులు నమోదు చేశారు. ఆమె గుర్తింపు కార్డులో నేపాల్ రాజధాని ఖాట్మాండు చిరునామా ఉందని పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో తనను చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని వెల్లడించింది. ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్‌లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!