Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉంటే ‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. మయిజ్జూ చైనా అనుకూలుడిగా ఉంటూ భారత వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మయిజ్జూ చైనాలో దిగిన రోజే అక్కడి ప్రభుత్వ మీడియా సంపాదకీయలంలో ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Manushi Chhillar: రెడ్ శారీ లో నడుము అందాలు ఆరబోస్తున్న మానుషి చిల్లర్…
దక్షిణాసియా సమస్యలను చూడటానికి ‘‘ఓపెన్ మైండెడ్’’ విధానం అవసరమని చైనా చెప్పుకొచ్చింది. గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో చైనా ఎల్లప్పుడూ మాల్దీవ్స్‌ని సమాన భాగస్వామిగి చూస్తుందని, దాని సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తోందని పేర్కొంది. ‘‘ మాల్దీవులు, భారత్ మధ్య స్నేహపూర్వక, సహకార సంబంధాలను కూడా గౌరవిస్తాం. న్యూఢిల్లీలో మాలే సంబంధాల ప్రాముఖ్యత గురించి తెలుసు. చైనా, భారత్ మధ్య విభేదాలు ఉన్న కారణంగా బీజింగ్ ఎన్నడూ కూడా భారతదేశాన్ని దూరం పెట్టాలని కోరలేదు. ఇది మాల్దీవులు, భారత్ మధ్య సహకారానికి, సంబంధాలకు ముప్పుగా చూస్తాం’’ అని చైనా పేర్కొంది. చైనా-భారత్-మాల్దీవ్స్ మధ్య త్రైపాక్షిక సహకారాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్ కంట్రీ పేర్కొంది. దక్షిణాసియా దేశాలతో చైనా సహకారం ‘జీరో-సమ్ గేమ్’, కాబట్టి న్యూఢిల్లీ మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉండాలని పేర్కొంది.
అంతకుముందు చైనా విదేశాంగా శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. మయిజ్జూ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరుపుతారని, పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారని, చైనా-మాల్దీవుల మధ్య సంబంధాలు ఇప్పుడు చారిత్రాత్మకంగా మారుతాయని, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుతాయని ఆమె అన్నారు.