Chhattisgarh: ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా ప్రాణాలు తీసుకున్న యువతి
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా ప్రాణాలు తీసుకున్న యువతి
- ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో ఘటన
- నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగా ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 20 మంది ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో చోటుచేసుకుంది.
అంకుర్ నాథ్(21) అనే యువతి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియాకు బానిసైంది. రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇదే ఆమె వ్యాపకం అయిపోయింది. రాయ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాగర్ పట్టణంలో అంకుర్ నాథ్ తన అక్కతో కలిసి నివసిస్తోంది. అయితే గత సోమవారం (డిసెంబర్ 30, 2024) ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా.. దాదాపు 20 మందికిపైగా ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో లైవ్‌లో ఉన్నవారంతా భయకంపితులయ్యారు. ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. ఇంటి డోర్ పగులగొట్టి లోపలి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చేయ్యి దాటిపోయింది. ఆమె ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో ఒక ఫాలోవర్ షాక్‌లోకి వెళ్లిపోయాడు.
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ఇది కూడా చదవండి: Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?
సోమవారం జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుందని వెల్లడించారు. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నామని.. లోతుగా విచారిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుమార్తె మరణవార్త తెలిసి షాక్ అయిపోయారు.
ఇది కూడా చదవండి: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
Mukesh Ambani: వాటర్, కోలా తర్వాత ఐస్‌క్రీమ్.. రూ.10తో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అంబానీ ఎంట్రీ
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!