ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా చింతగుఫ్ఫ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనను ఎస్పీ సునిల్ శర్మ ధృవీకరించారు. అయితే ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగునున్న నేపథ్యంలో యస్టియఫ్, సీఆర్పీఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసుల విస్తృత తనిఖీలు చెప్పటింది. ఎన్కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి మృతదేహాం స్వాధీనం చేసుకున్నారు. మృతులు పెరిగే అవకాశం ఉందని తెలిపిన ఎస్పీ సునిల్ శర్మ.. ఆపరేషన్ చింతగుఫ్ఫలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య హోరాహోరీ గా సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కూబింగ్ లో సిఆర్పియఫ్ 150,131,యస్టియఫ్,డీఆర్జీ, బలగాలు పాల్గొన్నాయి.