Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chhattisgarh Bjp Leader Neelkanth Nakkem Hacked To Death By Maoists

Chhattisgarh Maoists: బీజేపీ నాయకుడ్ని చంపిన మావోయిస్టులు.. కుటుంబ సభ్యుల ముందే..

Published Date :February 6, 2023 , 12:20 pm
By NTV WebDesk
Chhattisgarh Maoists: బీజేపీ నాయకుడ్ని చంపిన మావోయిస్టులు.. కుటుంబ సభ్యుల ముందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chhattisgarh BJP Leader Neelkanth Nakkem Hacked To Death By Maoists: మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నాయకున్ని అత్యంత దారుణంగా హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు నీల్‌కంఠ్ నక్కెంను కిరాతకంగా చంపేశారు. గత 15 ఏళ్లుగా ఉసూర్ బ్లాక్‌కి బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న నీల్‌కంఠ్.. తన స్వగ్రామమైన పైక్రమ్‌లో బంధువు వివాహానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, నీల్‌కంఠ్‌పై ఎగబడ్డారు. మొత్తం 150 మంది గుంపుగా పైక్రమ్‌కి చేరుకున్నారు కానీ, వారిలో ముగ్గురు మాత్రమే నీల్‌కంఠ్‌పై దాడి చేసి చంపారు. కుటుంబ సభ్యుల ముందే కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆ మావోయిస్టులు.. ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ, ఆ బీజేపీ నాయకుడ్ని చంపారు. అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు

ఈ ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ గవర్న మాట్లాడుతూ.. ‘‘నిషేధిత సీపీఐ (ఎం) సాయుధ కార్యకర్తలు నీల్‌కంఠ్‌పై గొడ్డళ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నీల్‌కంఠ్.. అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. మొత్తం 150 మంది మావోయిస్టులు ఆయుధాలతో వచ్చారని, కానీ ముగ్గురు మాత్రమే ఆ బీజేపీ నాయకుడి ఇంటికి చేరుకోగలిగారని తెలిసిందన్నారు. సాధారణ దుస్తుల్లో మావోయిస్టులు రావడంతో, వారిని గుర్తించడం కష్టమైందన్నారు. అవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సివిలియన్‌ని సైతం మావోయిస్టులు చంపినట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఇదే సమయంలో నీల్‌కంఠ్ భార్య లలిత నక్కెం మాట్లాడుతూ.. తన భర్తను కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి, కుటుంబ సభ్యుల & గ్రామస్థుల ముందే ఆయనపై దారుణంగా దాడి చేశారన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారన్నారు.

Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chhattisgarh Crime News
  • Lalitha Nakkem
  • Maoists
  • Maoists Killed BJP Leader
  • Neelkanth Nakkem

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions