Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేసిన విజయ్ సర్కార్..
- కొత్త విమానాశ్రయం కోసం మానెల్లోర్, చేయ్యూర్ ప్రాంతాలు షార్ట్‌లిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Second Airport: చెన్నైకి రెండో ఎయిర్‌పోర్టుపై విజయ్ సర్కార్ రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించింది. పరంబూర్లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా మానెల్లోర్, చేయ్యూర్ ప్రాంతాలను కొత్త ఎయిర్‌పోర్టు కోసం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ రెండు ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంతాలను ‘‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)’’కు పంపించి, ఫీజిబిలిటీ సర్వే చేయాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి సాంకేతిక అనుకూలత, కనెక్టివిటీ, భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
మానెల్లోర్ చెన్నైకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చేయ్యూర్ సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిపాదిత విమానాశ్రయం చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా (CMA) అవసరాలను తీర్చేలా ఉండనుంది. పరంబూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రద్దుపై విజయ్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే రైతులు, వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలపై ప్రభావాన్ని తగ్గించేందుకు పెరంబూర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. చెన్నైకి రెండో ఎయిర్ పోర్టు అవసరమే కానీ, దాని కోసం వ్యవసాయం భూములు, నివాస ప్రాంతాలకు తక్కువ నష్టం కలిగించే ప్రాంతాన్ని ఎంచుకోవాలని విజయ్ అసెంబ్లీలో చెప్పారు.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
గతంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ పరంబూర్ ప్రాజెక్టు విషయంలో రైతులు, స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కొంది. ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో భూసేకరణ అవసరం కావడం, నీటి వనరులు, వ్యవసాయ భూములు కోల్పోయే అవకాశం ఉండటంతో నిరసనలు జరిగాయి. ఇప్పుడు మానెల్లోర్, చేయ్యూర్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడంతో విజయ్ సర్కార్ చెన్నైకి రెండో విమానాశ్రయంపై అడుగులు పడ్డాయి.
తాజావార్తలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!