అక్రమ సంబంధం జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి.. ఆ సంబంధాల కోసం కన్నవారిని కూడా దూరం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ప్రియుడితో రాసలీలల కోసం కన్న కొడుకునే పొట్టన పెట్టుకుంది ఓ కసాయి తల్లి..తల్లి బంధానికే మాయని మచ్చ తీసుకొని వచ్చింది..కుమారుడు తనతో ఉంటే ప్రియుడు తనని పెళ్లి చేసుకోడని భావించింది. దీంతో కుమారుడిని హతమార్చింది. దృశ్యం సినిమాలో చూపించిన విధంగా డెడ్ బాడీని మాయం చేసింది.. ఆ తర్వాత బిడ్డ కనిపించలేదని పోలీసులకు పిర్యాదు చేసింది.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నమ్మలేని నిజాలను బయటపెట్టారు..
వివరాల్లోకి వెళితే..ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ కు చెందిన 22 ఏళ్ల నయన మాండవి అనే మహిళ గుజరాత్ లోని సూరత్ జిల్లాలో నివసిస్తోంది. దిండోలీ ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తోంది. అయితే ఆమె జూన్ 27వ తేదీన తన రెండేళ్ల కుమారుడు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ పని చేస్తున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అందులో పిల్లాడు బయటకు వచ్చినట్టుగా ఎలాంటి అనవాళ్లు కనిపించడం లేదు. దీంతో బాబు నిర్మాణ స్థలం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు..
బాబు ఆచూకి కోసం అన్ని విధాలుగా ప్రయత్నించారు.. పోలీసులకు తల్లి నయన మాండవిపై అనుమానం వచ్చింది. కుమారుడి అదృశ్యంపై పోలీసులు ఆమెను విస్తృతంగా ప్రశ్నించారు. కానీ ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో పోలీసులు సంతృప్తి చెందలేదు. ఇలా ప్రశ్నిస్తున్న సమయంలోనే నివసిస్తున్న తన ప్రియుడిపై ఆమె ఆరోపణలు చేసింది. అతడే తన బిడ్డను కిడ్నాప్ చేశాడని తెలిపింది. దీంతో ప్రియుడిని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు విచారణలో అతడెప్పుడూ సూరత్ కు రాలేదని తేలింది. దృశ్యం సినిమా చూసిన ఈమె అదే స్టైల్లో బాలుడిని చంపి శవాన్ని మాయం చేసింది.. పోలీసుల ప్రశ్నలతో మొత్తం నిజం కక్కింది.. ప్రస్తుతం ఈ ఘటన తో స్థానికంగా కలకలం రేపుతుంది..