Centre Govt: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు అధ్వాన్నంగా మారిపోతుంది. ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం ప్రభావంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన తక్షణం ఆమల్లోకి వస్తుందని వెల్లడించింది.
Read Also: Oben Rorr EZ: తక్కువ ధరలో పట్టణ ప్రయాణ అవసరాల కోసం వచ్చేసిన ఛార్జింగ్ బైక్
కాగా, ఈ నిబంధనల ప్రకారం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు 5 వేల రూపాయల జరిమానా విధించనుండగా.. 2 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న వారికి రూ.10 వేలు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.30 వేలు జరిమానా విధించనున్నారు. శీతాకాలంలో దేశ రాజధాని ఢిల్లీని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సుప్రీంకోర్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడంతో.. కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
Read Also: MLA Madhavi Reddy Vs YSRCP: కడప మున్సిపల్ సమావేశం రసాభాస.. మాధవీరెడ్డి వర్సెస్ వైసీపీ
ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత ఈరోజు (గురువారం) భారీగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. రాజధాని నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక 362గా నమోదు అవ్వగా.. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు 400 మార్కును దాటేసింది.