CBSE Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం 12వ తరగతి కంపార్ట్మెంట్ ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు పరీక్షల్లో తమ ఫలితాలను https://cbseresults.nic.in, https://cbse.gov.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు. స్కోర్కార్డులనును మొబైల్ యాప్ ఉమాంగ్(umang)తో పాటు https://web.umang.gov.in వెబ్సైట్లో కూడా చూడవచ్చు. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించిన కంపార్ట్మెంట్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు 23 ఆగస్టు 2022న జరిగాయి. 12వ తరగతికి సంబంధించిన ప్రధాన పరీక్షల ఫలితాలు 22 జూలై 2022న ప్రకటించబడ్డాయి.
మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఏదో ఒక సబ్జెక్టులో ఇంకా ఎక్కువ మార్కుల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను కూడా ప్రకటించారు. ఫలితాల ప్రకటన సమయంలోనే పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన కంపార్ట్మెంట్ కేటగిరీ అభ్యర్థులందరికీ సీబీఎస్ఈ కంబైన్డ్ మార్క్ షీట్-కమ్-పాసింగ్ సర్టిఫికేట్‌ను అందజేస్తోందని బోర్డు తెలిపింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, మైగ్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు వారి కంబైన్డ్ మార్క్ షీట్ కమ్ పాసింగ్ సర్టిఫికేట్ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచబడుతుంది. రెండు డిజిటల్ పత్రాలు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం కోసం ఉపయోగించబడతాయి.
Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
ఇంప్రూవ్మెంట్ కోసం హాజరైన లేదా కంపార్ట్మెంటల్ విద్యకు అర్హత సాధించిన విద్యార్థుల విషయంలో, వారి డిజిటల్ లాకర్లో ఒకే సబ్జెక్ట్ పనితీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నెల 9వ తేదీ నుంచి నుండి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం మార్కుల రీవాల్యుయేషన్‌ను కూడా బోర్డు ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫోటోకాపీలు, రీవాల్యుయేషన్‌ను అందించే సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుందని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది.