Birbhum: బీర్భూమ్ ఘటనలో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లా బోగ్టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు సంబంధించిన పత్రాలతో పాటు అదుపులోకి తీసుకున్న నిందితులను సీబీఐకి అప్పగించాలని సిట్ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది కోల్‌కతా హైకోర్టు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని బోగ్టూయి గ్రామానికి పంపి… అవసరమైన నమూనాలను సేకరించాల్సిందిగా సూచించింది. హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే గ్రామానికి వెళ్లనున్నారు ఫోరెన్సిక్ నిపుణులు.
Read Also: Yogi Cabinet: పక్కా ప్లాన్‌తో యోగి కొత్త కేబినెట్.. ముస్లిం నేతకు చోటు
Also Read
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
బీర్భూమ్ ఘటనపై సుమోటోగా విచారణ ప్రారంభిస్తూనే ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారుకాకుండా చర్యలు చేపట్టింది కోల్‌కతా హైకోర్టు. బోగ్టూయి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి… అక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు… అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రికార్డు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ని ఆదేశించింది. ఇక, కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేపట్టింది. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి సీనియర్ సీబీఐ అధికారులు మరియు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన బృందాన్ని పంపినట్టు ఓ అధికారి తెలిపారు.. ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి ఆధారాలను సేకరించేపనిలో పడింది సీబీఐ.. మరోవైపు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసు అధికారులు లేదా రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ విషయంలో తదుపరి విచారణను నిర్వహించదు.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!