పశ్చిమ బెంగాల్‌లో బీర్భూమ్ జిల్లా బోగ్‌టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు…