KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul on Indian Dressing Room: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 206 పరుగులకే ఆలౌట్ చేశారు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తమ వంతు సహకారం అందించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సానుకూల వాతావరణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఒకరినొకరు నేర్చుకునేందుకు భారత ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని లోకేష్ రాహుల్ చెప్పాడు. జట్టులో ప్రతి ఒక్కరూ మరో ఆటగాడికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నాడు ‘మీరు సీనియర్ అయినా, 26 ఏళ్ల వయసులో 20 టెస్టులు ఆడిన ఆటగాడైనా.. మీ సహచరుడికి సహాయం చేయడం బాధ్యత. గతంలో 60-70 టెస్టులు ఆడిన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు నేను 20 లేదా 30 టెస్టులే ఆడి ఉండేవాడిని. అయినప్పటికీ వారి నుంచి నేర్చుకోకూడదనే సిగ్గు లేదా అహంకారం ఎవరికీ ఉండేది కాదు. అలాగే ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాడిని సంప్రదించకూడదనే భావన కూడా లేదు. మా డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణంగానే ఉంది’ అని రాహుల్ చెప్పాడు.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
వయసు, అనుభవం ఆధారంగా నేర్చుకోవడాన్ని పరిమితం చేసుకోకూడదని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల నుంచి కూడా తాను విషయాలు నేర్చుకుంటానని తెలిపాడు. ‘నేను కొత్త ఆటగాడి నుంచి కూడా ఒకటి రెండు విషయాలు నేర్చుకుంటా. ఇప్పుడు యశస్వి జైస్వాల్‌తో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్ల గురించి మాట్లాడుతుంటాను. అతడి ఆలోచనలను తెలుసుకుంటాను. అతడి ఆలోచనా విధానం నాకంటే భిన్నంగా ఉంటుంది. అలాగే నా ఆలోచనలు మరొకరికి భిన్నంగా ఉండొచ్చు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం భారత జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతోంది’ అని రాహుల్ వివరించాడు.
శ్రీలంకపై తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. సుతార్ నిలకడగా బంతులు వేస్తూ, చిన్నచిన్న మార్పులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడని చెప్పాడు. అతడి బౌలింగ్‌లో స్థిరత్వమే ప్రధాన బలమని పేర్కొన్నాడు. ‘సుతార్ రోజంతా ఒకే ప్రాంతంలో నిలకడగా బౌలింగ్ చేయగలడు. చిన్నచిన్న మార్పులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. బంతి పెద్దగా కదలకపోయినా.. ఏదో ఒకటి చేయాలనే ఆలోచన బ్యాటర్లో మొదలవుతుంది. అలాంటి మానసిక స్థితిలోకి బ్యాటర్‌ను తీసుకెళ్లగలిగితే బౌలర్‌దే పైచేయి అవుతుంది’ అని రాహుల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!