Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం
- సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు అప్పగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసింది. కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు ఇది సాధారణ మరణం కాదని, వరకట్న వేధింపులు, మానసిక హింస కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిబాలా సింగ్ రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన వ్యక్తి కావడం, కేసులో ప్రభావం చూపే అవకాశాలపై ఆరోపణలు రావడంతో దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also Read
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి Mohan Yadavను కలిసి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం సీఎం మోహన్ యాదవ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ట్విషా కుటుంబం రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టును ఆశ్రయించినప్పటికీ, భోపాల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే శవాన్ని సరైన పరిస్థితుల్లో భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
-
BCCI Trolls: పర్ఫామెన్స్‌కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్‌లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
-
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
-
Iran War: ట్రంప్‌ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందా?
-
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!