NTV Telugu Site icon

Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..

Rajastan

Rajastan

Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్‌మెంట్‌లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి

అల్మారాలో దాచి ఉంచిన ట్రాలీ సూట్‌కేస్‌లో రూ.2000, రూ.500 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ రూ. 2000 కరెన్సీ చెలామణిని ఉపసంహరించుకున్న తర్వాతి రోజే రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు అధికారులు వివరించారు. సూట్‌కేస్‌ నిండా నగదు, బంగారం కనుగొన్నామని, ఆ తర్వాత అనుమానిత ఉద్యోగులను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ-ఫైలింగ్ ప్రాజెక్ట్ కింద ఫైళ్లను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నామని, తాళం వేసి ఉంచిన రెండు అల్మారాలను తెరిచిన సమయంలో భారీగా డబ్బు, బంగారం కనిపించినట్లు అధికారలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు అల్మారాలు గత కొంత కాలంగా తాళం వేేసే ఉన్నాయి. డబ్బు ఎవరిది..ఎలా వచ్చింది.. విచారణ జరుపుతున్నారు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. యోజన భవన్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది.